కర్ణాటకలో మరో కుంభకోణం కలకలం సృష్టిస్తోంది. కొవిడ్ సంక్షోభ సమయంలో భారీ మొత్తంలో అవకతవకలు జరిగాయని తాజా నివేదికలో వెల్లడైంది. ఈ నివేదికను జస్టిస్ జాన్ మైఖెల్ కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసింది.
సిద్ధరామయ్య క్యాబినెట్ సమావేశంలో ఈ నివేదికపై చర్చించగా, కమిటీ వందల కోట్లు దుర్వినియోగం, కొన్ని కీలక పత్రాలు కోల్పోయిన విషయాలను గుర్తించినట్లు పేర్కొన్నాయి. సిద్ధరామయ్య ప్రభుత్వం బీజేపీ హయాంలో జరిగిన అక్రమాలపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకుంది.