కెన్యాలోని నైరీ కౌంటీ పట్టణంలో గురువారం అర్ధరాత్రి ఘోర విషాద ఘటన జరిగింది. ఎండరాషా ప్రైమరీ స్కూల్ హాస్టల్ భవనంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 17 మంది విద్యార్థులు సజీవ దహనం అయ్యారు.
మరో 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి. బాధిత విద్యార్థులు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్నిప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. దీనిపై పోలీసులు విచారణ ప్రారంభించారు.