మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. లోకేశ్ అనే వ్యక్తి ఓ మహిళకు బలవంతంగా మద్యం తాగించి రోడ్డు పక్కన ఆమెపై అత్యాచారం చేశాడు.
ఈ క్రమంలో అక్కడే ఉన్న కొందరు అత్యాచారాన్ని అడ్డుకోకుండా వీడియోలు తీశారని వారు చెప్పారు. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారానికి పాల్పడ్డాడని బాధితురాలు పేర్కొంది.