మార్కాపురం పట్టణంలో ట్రాఫిక్ కు అంతరాయం కలిగిస్తే వాహనదారులకు కఠిన చర్యలు తప్పవని మార్కాపురం సీఐ ఆవుల వెంకటేశ్వర్లు హెచ్చరించారు.ఈ సందర్భంగా శుక్రవారం పట్టణంలో రద్దీగా ఉండే కంభం రోడ్డు, దోర్నాల బస్టాండ్ ప్రాంతాల్లో సిబ్బందితో కలిసి నడుచుకుంటూ తిరుగుతూ ట్రాఫిక్ కు ఇబ్బంది కలిగిస్తున్న వాహనదారులకు జరిమానాలు విధించారు. తోపుడు బండ్లు రోడ్ల మీదే పెట్టి ట్రాఫిక్ ఇబ్బంది కలిగిస్తున్న వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు.