ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భార్యపై అనుమానంతో గొంతు కోసి హత్య చేసిన భర్త

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 06, 2024, 02:41 PM

ఏపీలోని తిరుపతి జిల్లాలో దారుణం జరిగింది. తిరుచానూరుకు చెందిన రూపావతి, రమేష్ దంపతులకు ఇద్దరు పిల్లలు. భార్యపై అనుమానం పెంచుకున్న రమేష్ తరచూ గొడవ పడేవాడు.
ఈ క్రమంలో గురువారం రాత్రి రమేశ్ మద్యం సేవించి ఇంటికి రావడంతో, భార్యభర్తల మధ్య గొడవ చోటు చేసుకుంది. దీంతో కోపోద్రిక్తుడైన రమేశ్.. తన భార్యను కత్తితో గొంతు కోసి హత్య చేశాడు. హత్య చేసిన అనంతరం నిందితుడు పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com