సాయుధ బలగాలు యుద్ధానికి సిద్ధంగా ఉండాలని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. గురువారం లఖ్‌నవూలో ఏర్పాటు చేసిన త్రివిధ దళాల కమాండర్ల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ఆయన మట్లాడుతూ రష్యా-ఉక్రెయిన్, గాజా సంక్షోభాలతోపాటు బంగ్లాదేశ్‌లో ప్రస్తుత పరిస్థితులను విశ్లేషించాలన్నారు. తద్వారా భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను అంచనా వేసుకోవడంతోపాటు ఊహించని పరిణామాలను దీటుగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు.
‘భారత్ శాంతి కోరుకునే దేశం, దీన్ని కాపాడుకోవాలంటే సాయుధ బలగాలు యుద్ధానికి సిద్ధంగా ఉండాలి. వాస్తవాధీన రేఖ వెంట నాలుగేళ్లుగా కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులను ప్రస్తావించారు. శాంతి, స్థిరత్వానికి ఉత్తర సరిహద్దు, పొరుగుదేశాల్లో నెలకొన్న పరిస్థితులు సవాల్ విసురుతున్నారు. వాటిని దృష్టిలో ఉంచుకొని సైన్యాధికారులు విస్తృత, లోతైన విశ్లేషణ చేయాలి’ అని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ తెలిపారు.