ఆంధ్రప్రదేశ్‌లో రైలు ప్రయాణికులకు ముఖ్యమైన గమనిక.. పలు రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. విజయవాడ డివిజన్‌లో సాంకేతిక పనుల దృష్ట్యా శుక్రవారం నుంచి ఈ నెల 8, 9 తేదీల వరకు పలు రైళ్లను రద్దుచేస్తున్నట్లుఒక ప్రకటనను అధికారులు విడుదల చేశారు. 07575 తెనాలి- విజయవాడ, 07500 విజయవాడ- గూడూరు, 07896 మచిలీపట్నం- విజయవాడ, 07769 విజయవాడ- మచిలీపట్నం, 07871/07872 మచిలీపట్నం- గుడివాడ, 07898/07899 మచిలీపట్నం- విజయవాడ, 07461 విజయవాడ- ఒంగోలు, 07576 ఒంగోలు- విజయవాడ, 07867 మచిలీపట్నం- విజయవాడ రైళ్లు రద్దు చేశారు.
07866 విజయవాడ- మచిలీపట్నం, 07770 మచిలీపట్నం- విజయవాడ, 07283 విజయవాడ- భీమవరం, 07772 భీమవరం-నిడదవోలు, 07882 నిడదవోలు- భీమవరం, 07865 భీమవరం- విజయవాడ, 07459 విజయవాడ-రాజమండ్రి, 17257 విజయవాడ- కాకినాడ పోర్ట్, 07868/07869 గుడివాడ-మచిలీపట్నం, 07885/07886 భీమవరం- నిడదవోలు, 07281 నరసాపురం-గుంటూరు, 07460 రాజమండ్రి- విజయవాడ, 07877 విజయవాడ- భీమవరం, 07885/07886 భీమవరం- నిడదవోలు, 17263 భీమవరం- నరసాపురం, 07673/07674 నరసాపురం- నిడదవోలు, 07863 నరసాపురం- విజయవాడ, 07768 విజయవాడ-రాజమండ్రి, 07767 రాజమండ్రి-విజయవాడ రైళ్లు రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. 17258 కాకినాడ పోర్ట్- విజయవాడ ( ఈ నెల 6వ తేదీ నుంచి 9 వరకు), 07977/07978 విజయవాడ- బిట్రగుంట( ఈ నెల 6 నుంచి 9 వరకు), 07784/07785 గుంటూరు- రేపల్లె(ఈ నెల 6 నుంచి 9 వరకు), 17269 విజయవాడ- నరసాపురం( ఈ నెల 7 నుంచి 9 వరకు) రద్దు చేశారు.
తెలుగు రాష్ట్రాల్లో వరుసగా దసరా, దీపావళి పండగలు ఉండటంతో మాల్డాటౌన్- సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు అధికారులు తెలిపారు. అక్టోబరు 8వ తేదీ నుంచి నవంబరు 28 వరకు ప్రతి మంగళ, గురువారాల్లో మాల్డాటౌన్- సికింద్రాబాద్ (03429/03430) రైలు నడుస్తుంది. ఈ రైలు ఖరగ్‌పూర్, బాలాసోర్, భద్రక్, కటక్, భువనేశ్వర్, కుర్దారోడ్ స్టేషన్‌లలో ఆగుతుంది. ఏపీ విషయానికి వస్తే.. శ్రీకాకుళం రోడ్, విజయనగరం, కొత్తవలస, పెందుర్తి, దువ్వాడ, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, గుంటూరు, నడికుడిలో ఆగుతుంది. తెలంగాణలోని.. మిర్యాలగుడ, నల్గొండ స్టేషన్లలో ఆగుతుందని విజయవాడ రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.