వినాయకుడి జన్మ రహస్యం గురించి అందరికీ తెలుసు. కానీ ఎక్కడ జన్మించింది మాత్రం చాలామందికి తెలిసి ఉండదు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉత్తరకాశీ జిల్లాలో ఉన్న అందమైన సరస్సు దోడితాల్ సమీపంలో జన్మించాడు. ఈ ప్రదేశం సముద్ర మట్టానికి 3,310 మీటర్ల ఎత్తులో ఉంది.
ఈ సరస్సు సమీపంలో ఉన్న ఆలయం గణేశుని జన్మస్థలంగా పరిగణించబడుతుంది. ఇక్కడ గణేశుడు తన తల్లి పార్వతితో కలిసి కొలువు దీరాడు. ఇక్కడ పార్వతీ దేవి అన్నపూర్ణ రూపంలో కొలువై ఉంది.