ఉత్తరప్రదేశ్లో ఘోర సంఘటన జరిగింది. రోడ్డు దాటుతున్న ఓ మహిళను అతివేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. యూపీలోని అమ్రోహాలో నిన్న ఈ ఘటన జరిగింది. హైవేపై ఓ మహిళ రోడ్డు దాటుతోంది. ఈ క్రమంలో వెనుక నుంచి అతివేగంగా వచ్చిన కారు ఆమెను ఢీకొట్టింది. దీంతో ఆమె దాదాపు 15 అడుగుల అవతల గాల్లోకి ఎగిరి పడి దుర్మరణం పాలైంది. కారు డ్రైవర్ ఆపకుండా పరారయ్యాడు.