విజయవాడ పాయకపురంలో వరద ముంపు ప్రాంతాల్లో మంత్రి పొంగూరు నారాయణ పర్యటించారు. రైతు బజార్ రోడ్డులో వరద నీరు ఉన్న ప్రాంతాల్లో బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పారు. పారిశుద్ధ్య పనులు జరుగుతున్న తీరును పరిశీలించారు. శానిటేషన్‌లో భాగంగా డ్రైనేజీపై బ్లీచింగ్ చల్లారు. చాలా ప్రాంతాల్లో శానిటేషన్ పనులు పూర్తి చేస్తామని అన్నారు. మళ్లీ తిరిగి వర్షం రావడంతో కొంత పనులకు అంతరాయం కలిగిందని,. డ్రైనేజ్ పనులపై కూడా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టామని మంత్రి తెలిపారు. నీరు నిల్వ ఉన్నప్పటికీ చెత్తను తొలగించకుంటే అంటు వ్యాధులు వస్తాయని, అందుకే నీటిలో ఉన్న చెత్తను తొలగిస్తున్నామని అన్నారు. వైద్యారోగ్య శాఖతో కలిసి హెల్త్ క్యాంప్‌లు నిర్వహిస్తున్నామని మంత్రి నారాయణ వెల్లడించారు.