పాతపట్నం నీలకంఠేశ్వర స్వామి ఆలయం సమీపంలో మహేంద్ర తనయా నదీ కాజ్వే వద్ద ప్రమాద హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. నదీలో వరద ఉధృతి దృష్ట్యా సి.ఐ సాయి, ఎస్ఐ లావణ్య ఆద్వర్యంలో బోర్డు ఏర్పాటు చేశారు. కాజ్వే ముంపునకు గురి కావడం హరిజన, కాపు, గోపాలపురం ప్రజలు, పాతపట్నం రైతులు, గణేష్ నిమజ్జనానికి భారీ సంఖ్యలో భక్తులు వస్తుండడంతో ఎటువంటి ప్రమాదం జరగకుండా పోలీస్ శాఖ ముందుస్తు చర్యలు చేపట్టారు. ప్రజలు జాగ్రత్తలు పాటించాలని కోరారు.