రాష్ట్రంలోని దళిత, గిరిజనులకు నేరుగా సంక్షేమ పథకాలు అందేలా ప్రభుత్వాలు కృషి చేయాలని జై భీమ్ మాదిగ రిజర్వేషన పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు చిక్కం జానయ్య అన్నారు. సోమవారం కర్నూలు నగరంలో పర్యటించిన అనంతరం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లా డుతూ నగరంలో మాదిగ కులాలు అధిక సంఖ్యలో ఉన్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దళిత, గిరిజనులకు అందించే సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు అందకుండా నాయకులు, అధికారులు వివక్షచూపుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి సత్యన్న, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రశాంత, ఉపాధ్యక్షుడు ఎర్రన్న, ప్రసాద్, కర్ణబాబు తదితరులు పాల్గొన్నారు.