బనగానపల్లె పట్టణాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని రోడ్లు భవనాల శాఖామంత్రి బీసీ జనార్దనరెడ్డి అన్నారు. సోమవారం సాయంత్రం బనగానపల్లె పట్టణంలో అధ్వాన స్థితిలోఉన్న రోడ్లను, డ్రైనేజీ కాల్వలను మంత్రి స్వయంగా అధికారులతో కలసి పర్యవేక్షించారు. పట్టణంలోని ఆస్థానం వద్ద రోడ్లు గుంతలమయంగా మారడడంతో ఆ ప్రాంతాన్ని తొలుత పరిశీలించారు. ఈ సందర్భంగా బీసీ మాట్లాడుతూ బనగానపల్లె పట్టణంలో వర్షాలు తగ్గిన వెంటనే రూ..35 లక్షలతో బనగానపల్లె పట్టణంలో సీసీరోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసి పట్టణంలో డ్రైనేజీ వ్యవస్థను శాశ్వతంగా పరి ష్కరించనున్నట్లు తెలిపారు. పట్టణాన్ని సుందరంగా తీర్చడానికి ప్రణా ళికలు ిసిద్ధం చేయాలని అఽధికారులను ఆదేశించారు. గత వైసీపీ పాలనలో పట్టణంలో పనులు చేపట్టలేదన్నారు. ప్రస్తుతం ఆస్థానం పక్కన రోడ్డు గుంతల మయంగా మారిందని అనేక మంది ఇక్కడ కిందపడ్డారని, మోటా రు సైకిళ్లు కింద పడి ప్రమాదాలకు గురయ్యారన్నారు. ఆయన వెంట పలువురు పంచాయతీరాజ్ డీఈ నాగశ్రీనివాసులు, టీడీపీ నాయకులు టంగుటూరు శ్రీనయ్య, మౌళీశ్వరరెడ్డి, అహ్మద్‌బాషా, హర్షద్, జంగంశెట్టి, రాయలసీమ సలాం, తదితరులు పాల్గొన్నారు.