ఏపీలో గోదావరి మహోగ్రరూపం దాల్చుతోంది. భారీ వర్షాలతో గోదావరి వరద ఉధృతి అంతకంతకూ పెరుగుతూనే ఉంది. జిల్లాలోని కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో గోదావరి వరద పెరుగుతోంది. వేలేరుపాడు మండలం రుద్రంకోటతో పాటు పలు గ్రామాలు జల దిగ్బంధంలో ఉన్నాయి. వెంటనే అప్రమత్తమైన అధికారులు.. ముంపు వాసులను దాచారంలోని పునరావాస కేంద్రాలకు అధికారులు తరలించారు. గోదావరి, శబరి నదులకు వరద పోటు ఉండటంతో గంట గంటకు పెరుగుతున్న వరదతో ముంపు ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.