ఏపీలో ఇటీవల సంభవించిన వరదలతో లక్షలాది ప్రజలు తీవ్ర ఇక్కట్ల పాలయ్యారు. ముఖ్యంగా విజయవాడ నగరం వరద గుప్పిట్లో చిక్కుకుని విలవిల్లాడింది. విజయవాడలో ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ నేపథ్యంలో, వరద బాధితుల కోసం ఏపీ ప్రభుత్వానికి పెద్ద ఎత్తున విరాళాలు అందుతున్నాయి. తాజాగా, మెగా హీరో సాయి దుర్గా తేజ్ ఏపీ మంత్రి నారా లోకేశ్ ను కలిసి రూ.10 లక్షల విరాళం అందించారు. ఈ సందర్భంగా సాయి దుర్గా తేజ్ ను మంత్రి లోకేశ్ మనస్ఫూర్తిగా అభినందించారు. ఇక, ఇవాళ కూడా నారా లోకేశ్ ను చాలామంది కలిసి విరాళాలు అందించారు. సచివాలయంలోని 4వ బ్లాక్ లో మంత్రి నారా లోకేశ్ ను కలిసిన దాతలు చెక్కులు అందజేశారు.