మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరిగిన సామూహిక అత్యాచార ఘటనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘ట్రైనీ ఆర్మీ అధికారులపై దాడి, వారి స్నేహితురాలిపై అత్యాచారం సమాజాన్ని సిగ్గుపడేలా చేసింది.
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో శాంతిభద్రతలు కరువయ్యాయి. యంత్రాంగం వైఫల్యం వల్లే నేరస్థులు చెలరేగిపోతున్నారు. జనాభాలో సగమైన ఆడపిల్లలపై ఇలాంటి ఘటనలు జరుగుతున్నా.. ఇంకా ఎంతకాలం కళ్లుమూసుకొని ఉంటాం..?’’ అని నిలదీశారు.