అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు భారీగా పడిపోయాయి. ఈ నేపథ్యంలో భారత్‌లోనూ పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశం ఉంది. ఇదే విషయాన్ని పెట్రోలియం శాఖ కార్యదర్శి పంకజ్ జైన్ సూచనప్రాయంగా వెల్లడించారు.
అంతర్జాతీయంగా ధరలు ఇదే స్థాయిలో కొనసాగితే.. ప్రభుత్వరంగ చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించే అవకాశం ఉందని పేర్కొన్నారు.