చిత్తూరు, తిరుపతి జిల్లాల వైసీపీ నేతలతో పార్టీ అధినేత జగన్ భేటీ అయ్యారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో పార్టీ స్థితిగతులపై చర్చలు జరిపారు.
ప్రభుత్వ చేసే ప్రజా వ్యతిరేక కార్యకలాపాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని నేతలకు జగన్ దిశానిర్దేశం చేశారు. పార్టీ బలోపేతంపై దృష్టిసారించాలని సూచించారు. సమావేశంలో మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రోజా, ఇతర నేతలు పాల్గొన్నారు.