పలమనేరు మున్సిపాలిటీ గాంధీనగర్ ప్రాథమిక పాఠశాలలో హెచ్ఎం వేమచంద్రారెడ్డి(56) గుండెపోటుతో మృతి చెందారు. బుధవారం ఉదయం ఆయన విద్యార్థులకు పాఠం చెబుతూ ఒక్కసారిగా కుప్పకూలారు. వెంటనే ఉపాధ్యాయులు ఆటోలో ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షించి అప్పటికే ఆయన మృతి చెందినట్లు నిర్ధారించారు. వేమచంద్రారెడ్డి యూటీఎఫ్ మండల అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. ఆయన మృతికి పలువురు ఉపాధ్యాయులు సంతాపం వ్యక్తంచేశారు.