కాణిపాక బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం వరసిద్ధుడు స్వర్ణ శేష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమానికి కాణిపాకం, కాణిపాకం,వడ్రాంపల్లె, మిట్టఇండ్లు, కొత్తపల్లె, అడపగుండ్లపల్లె, బొమ్మసముద్రం, తిమ్మోజిపల్లె,తిరువణంపల్లె, చిగరపల్లె, అగరంపల్లె గ్రామాలకు చెందిన కమ్మ వంశస్థులు ఉభయదారులుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా ప్రధాన ఆలయాన్ని, ధ్వజ స్తంభాన్ని, సుపథ మండపాన్ని వివిధ పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. ఉదయం ఉభయదారుల ఆధ్వర్యంలో మూల విరాట్‌కు పంచామృత అభిషేకాన్ని నిర్వహించాక భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. ఉదయం సిద్ధి,బుద్ధి సమేత వరసిద్ధుడు చిన్నశేష వాహనంపై పురవీధులలో ఊరేగారు. రాత్రి ఉభయ వరస రావడంతో కల్యాణ వేదిక వద్ద సిద్ధి,బుద్ధి సమేత గణపతి ఉత్సవర్లకు పూజలు నిర్వహించారు. స్వర్ణ పెద్దశేష వాహనంపై ఉత్సవర్లను కాణిపాకంలో ఊరేగించారు. ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు మురళీ మోహన్, గురజాల జగన్మోహన్, జడ్పీటీసీ సుచిత్ర, ఆలయ ఈవో గురుప్రసాద్, ఏఈవోలు రవీంద్రబాబు, విద్యాసాగర్‌రెడ్డి, ఎస్వీ.కృష్ణారెడ్డి, హరిమాధవరెడ్డి, సూపరింటెండెంట్లు కోదండపాణి, శ్రీధర్‌బాబు, మండల టీడీపీ అధ్యక్షుడు గిరిధర్‌బాబు, మాజీ చైర్మన్ మణినాయుడు, మాజీ సర్పంచ్ మధుసూదన్‌రావు, మాజీ జడ్పీటీసీ లత, రైతు నేత గంగారపు హరిబాబునాయుడు, ఉభయదారుల సంఘ అధ్యక్షుడు ఈశ్వర్‌బాబు, ఉభయదారులు పాల్గొన్నారు.