వరద బాధితులకు మదనపల్లె నియోజకవర్గ ప్రజలు అండగా నిలిచారని ఎమ్మెల్యే షాజహానబాషా తెలిపారు. బుధవారం మదనపల్లె టౌనహాల్లో 3 వేల నిత్యావసర కిట్లు, 500 గ్యాస్ స్టౌవ్‌లు, ఇతర సామగిని ప్యాక్ చేసి లారీలకు లోడ్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మదనపల్లె ప్రజలు తమ వంతుగా అందజేసిన విరాళాలతో పాటు, తన వంతు రూ.5 లక్షలు వెచ్చించి ఐదు వేల మందికి సరిపడా సరుకులు, వస్తువులు సిద్ధం చేశామన్నారు. మదనపల్లె నుంచి 20 మంది టీడీపీ నాయకుల తో విజయవాడకు వెళ్లి అక్కడ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అనిల్‌కుమార్ సింఘాల్ ఆధ్వర్యంలో వరద బాధితులకు ఈ కిట్లను పంపిణీ చేస్తా మన్నారు. సబ్‌కలెక్టర్ మేఘస్వరూప్ మాట్లాడుతూ వారం రోజులుగా వరద బాధితుల అవస్థలు, వారిని ప్రభుత్వం, అధికారులు ఆదుకుంటు న్న తీరును నిత్యం దినపత్రికలు, టీవీల్లో చూస్తున్నామని, దీనికి స్పందించి మదనపల్లె ప్రజలు ఈ విరాళాలను అందించడం అభినం దనీయమన్నారు. టీడీపీ నాయకులు విద్యాసాగర్, రామకృష్ణాచారి, బాలుస్వామి, శివన్న, షంషీర్, సంగం హరి తదితరులు పాల్గొన్నారు.