ఆదిమూలం తనను లైంగికంగా వేధించారని ఫిర్యాదు చేసిన బాధిత మహిళకు తిరుపతి ప్రభుత్వ మెటర్నటీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు ముగిశాయి. తొలుత పోలీసులు రెండు సార్లు ప్రయత్నించినా ఆమె వైద్య పరీక్షలకు ముందుకు రాలేదు. అయితే బుధవారం ఆమె అందుబాటులోకి రావడంతో అదే రోజు మధ్యాహ్నం 3.30 గంటలకు తిరుపతిలోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రికి తీసుకెళ్లారు. కేసు దర్యాప్తునకు అవసరమైన పది రకాల పరీక్షల నిమిత్తం శాంపిల్స్ సేకరించారు. గురువారం సాయంత్రం 4 గంటలకు ఆమెను డిశ్చార్జి చేశారు.