శ్రీకాకుళం జిల్లా, రణస్థలం మండలం పతివాడపాలెం గ్రామానికి చెందిన ఎస్.సన్యాసిరావు (53) గురు వారం చెరువులో జారిపడి మృతి చెందాడు. జేఆర్ పురం ఎస్ఐ చిరంజీవి తెలిపిన వివరాల మేరక.. ఉపాధి పనులకువెళ్లి వస్తూ చెరువు వద్ద కాళ్లు చేతులు కడుగుకునే సమయంలో ప్రమాదవశాత్తు జారి పడిపోయాడు. అతడికి ఈత రాకపోవడం.. ఆ పరిసరాల్లో ఎవరూ లేకపోవడంతో ఊపిరాడక మృతి చెందాడు. సన్యాసిరావుకు భా ర్య, ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. మృదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్‌కు తర లించారు. భార్య దన్నమ్మ ఫిర్యాదు మేరకు ఎస్ఐ కేసు నమోదు చేశారు.