శ్రీకాకుళం జిల్లా, బూర్జ మండల కేంద్రం బూర్జ గ్రామానికి చెందిన ఖండ్యా పు లక్ష్మి(53) పాము కాటుకు గురై మృతి చెందింది. గురువారం పొలం పనులు చేస్తుండగా పాముకాటుకు గురైన లక్ష్మి.. అది గుర్తించకపోవడంతో సాయంత్రానికి పరిస్థితి విషమించి పొలంలోనే చనిపోయింది. దీంతో ఆమె భర్త రామారావు పోలీసులు ఫిర్యాదు చేశాడు. పోస్టుమార్టం నిమిత్తం లక్ష్మి మృతదేహాన్ని శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించా రు. పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమెకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.