‘‘నా బిడ్డకి బ్లడ్ కేన్సర్. జూనియర్ ఎన్టీయార్‌కి వీరాభిమాని. రోజు రోజుకీ పరిస్థితి విషమిస్తోంది. ‘అమ్మా దేవర సినిమా చూసి చచ్చిపోతా.. 27వ తేదీ దాకా నన్ను బతికించండి..’ అని వేడుకుంటున్నాడు’’ అంటూ 19 ఏళ్ల కౌశిక్ తల్లి సరస్వతి కన్నీరు మున్నీరవుతూ వెల్లడించారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో తమ బిడ్డ పరిస్థితి గురించి మీడియాకు వివరిస్తూ సాయం చేయండంటూ ఆమె వేడుకున్నారు. టీటీడీలో కాంట్రాక్ట్ డ్రైవర్‌గా పనిచేస్తున్న శ్రీనివాసులు, సరస్వతి దంపతుల పెద్ద కుమారుడు కౌశిక్ ఇంటర్ చదువుతుండగా అనారోగ్యానికి గురయ్యాడు. బ్లడ్ కేన్సర్ అని నిర్ధారణ కావడంతో 2022 నుంచీ చికిత్స తీసుకుంటున్నాడు. బోన్‌మారో చేయాలని వైద్యులు చెప్పారు. హైదరాబాద్‌లోని బసవతారకం కాన్సర్ ఆసుపత్రి సహా చెన్నై, బెంగుళూరు, హైదరాబాద్‌ల్లోని ఆసుపత్రులకు తిరిగారు. ప్రస్తుతం బెంగళూరులోని కిడ్‌వై హాస్పిటల్లో కౌశిక్ చికిత్స పొందుతున్నాడు. బోన్ మారో చికిత్సకు దాదాపు రూ.60లక్షలకు పైగానే ఖర్చవుతుందని తెలియడంతో తల్లిదండ్రులు హతాశులయ్యారు. రోజు రోజుకూ మరణానికి దగ్గరవుతున్న కొడుకును చూస్తూ వారు దుఃఖిస్తున్నారు. దాతలు ముందుకు వస్తే బిడ్డ బతుకుతాడని ఆశపడుతున్నారు. వారి వేదన చూసి ‘అమ్మా నేను బతకనని నాకు తెలుసు.. నా కోసం బాధపడకండి.. దేవర సినిమా దాకా బతికించండి చాలు.. నా చివరి కోరిక తీర్చండి’ అంటూ తమను బిడ్డ సముదాయిస్తున్నాడని చెబుతూ, కౌశిక్‌కి ప్రాణదానం చేయండంటూ ఆ తల్లిదండ్రులు చేతులు జోడిస్తున్నారు. 9490829381 నెంబరుకు ఫోన్‌పే, గూగుల్‌పే ద్వారా గానీ లేదా కె. సరస్వతి, యూనియన్ బ్యాంక్ అకౌంట్ నెంబరు 103310100044506, ఐఎ్‌ఫఎ్‌ససీ కోడ్ యూబీఐఎన్0801313కు గాని దాతలు తమ సాయాన్ని అందించవచ్చు.సమాచారం కోసం 79956 65169 నెంబరులో కౌశిక్ తల్లిదండ్రులను సంప్రదించవచ్చు.