గుత్తి పట్టణంలోని ఏడీజే కోర్టు, జూనియర్, సీనియర్ సివిల్ జడ్జి కోర్టులలో శనివారం జిల్లా ఆరవ అదనపు న్యాయమూర్తి శ్రీహరి ఆధ్వర్యంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సివిల్, క్రిమినల్, ఎక్సైజ్, పీఎల్ సీ వంటి కేసులు పరిష్కరించారు. బాధితులకు నష్టపరిహారం చెల్లించే విధంగా న్యాయమూర్తులు తీర్పు వెలువరించారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సభ్యులతో పాటు కోర్టు సిబ్బంది, కక్షిదారులు పాల్గొన్నారు.