గుజరాత్‌లోని గాంధీనగర్ దేహ్గామ్ ప్రాంతంలో శుక్రవారం రాత్రి ఊహించని ప్రమాదం జరిగింది. స్థానికంగా రోడ్లపై వీధి దీపాలు కొన్నాళ్లుగా వెలగడం లేదు. దీంతో రోడ్డుపై పడుకున్న ఆవును చీకటిలో ప్రయాణిస్తూ ఓ బైకర్ ఢీకొట్టాడు.
వెంటనే బైక్ బోల్తా పడింది. బైక్ నడుపుతున్న యువకుడు కింద పడడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. సంఘటనా స్థలంలోనే ఆ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాద వీడియో సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa