జగన్ ప్రభుత్వం సాగునీటి వ్యవస్థతో పాటు అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిందని మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. పాలకొల్లులో అద్దేపల్లి జయంతి వేడుకల్లో మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. అద్దేపల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి మంత్రి నిమ్మల ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా మంత్రి రామానాయుడు మాట్లాడుతూ... ఏపీలో వరదలకు కారణం వైసీపీ ప్రభుత్వ వైఫల్యమేనని ప్రజలు గ్రహించారని అన్నారు. సీఎం చంద్రబాబు 74 సంవత్సరాల వయస్సులో వరద నీటిలో నడిచి బాధితులను పరామర్శించారని తెలిపారు.