కేంద్రపాలిత ప్రాంతం, అండమాన్ నికోబార్ దీవుల రాజధాని పోర్ట్ బ్లెయిర్ పేరును "శ్రీ విజయపురం" గా కేంద్రప్రభుత్వం మార్పు చేసింది. ఈ అంశంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పోర్ట్ బ్లెయిర్ పేరును కేంద్రప్రభుత్వం మార్చడం సంతోమని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్‌లో పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నానని పవన్ కళ్యాణ్ అన్నారు.వందల ఏళ్ల పాటు పాశ్చాత్య దేశాల బానిసత్వ మూలాలకు నిదర్శనంగా, వలసవాద పాలనకు గుర్తుగా వారు పెట్టిన పేరును తీసేస్తూ, భారతదేశం సాధించిన విజయాలకు గుర్తుగా "శ్రీ విజయపురం" పేరు పెట్టడం ఆహ్వానించదగ్గ పరిణామమని కేంద్ర ప్రభుత్వాన్ని పవన్ కళ్యాణ్ కొనియాడారు. భావితరాలపై వలసవాద విధానాల ప్రభావం పడకుండా ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.