ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కువైట్ లో ఇబ్బంది పడుతున్న మహిళకి అండగా నిలిచిన ప్రభుత్వం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 14, 2024, 11:47 PM

అన్నమయ్య జిల్లా తంబేపల్లి మండలం నారాయణ రెడ్డి పల్లి గ్రామానికి చెందిన తిరుపతి కవిత ఉపాధి కోసం కువైట్ వెళ్లింది. పని ప్రదేశంలో ఇబ్బందులు పడుతున్నట్లు స్థానిక ఎమ్మెల్యే, మంత్రి రాంప్రసాద్ రెడ్డి దృష్టికి వచ్చింది. దీంతో ఆమెను రాష్ట్రానికి తీసుకురావాలని ప్రవాసాంధ్రుల సాధికారత, సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ను రాంప్రసాద్ రెడ్డి కోరారు. దీంతో ఏపీ ఎన్నార్టీ 24 గంటల హెల్ప్ లైన్ ద్వారా కువైట్ లో ఉన్న సామాజిక కార్యకర్త జిలకర మురళి, షేక్ రసీదా బేగం సహాయ సహకారాలతో కవిత ఆమె స్వగ్రామానికి చేరుకుంది. కువైట్ నుంచి ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ ఫ్లైట్‌లో శనివారం ఉదయం 7 గంటలకు చెన్నై ఎయిర్ పోర్టుకు చేరుకోగా.. అక్కడి నుంచి నారాయణరెడ్డి పల్లి చేరుకుంది. ఉపాధి కోసం కువైట్ వెళ్లిన కవిత పని ప్రదేశంలో అనేక ఇబ్బందులకు గురైనట్లు వీడియో ద్వారా వెల్లడించింది. ఆమెకు ఎదురైన ఇబ్బందుల దృష్ట్యా దగ్గరలో ఉన్న తన సోదరి వద్ద తాత్కాలిక ఆశ్రయం పొందింది. వీడియో సందేశాన్ని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి పంపించగా.. ఆయన తక్షణమే స్పందించి బాధితురాలి వివరాలను మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌కు ఇచ్చారు. కవితను స్వస్థలానికి సురక్షితంగా తీసుకురావాలని మంత్రి రాంప్రసాద్ రెడ్డి లేఖ రాశారు. శుక్రవారం ఉదయం మంత్రి కార్యాలయానికి సమాచారం అందిన వెంటనే తక్షణం స్పందించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఏపీ ఎన్నార్టీ అత్యవసర విభాగాన్ని అప్రమత్తం చేశారు. మంత్రి ఆదేశాలతో వెంటనే స్పందించిన ఏపీ ఎన్నార్టీ 24 గంటల అత్యవసర విభాగం 12 గంటల్లోపే స్పందించి ఆమెను స్వదేశానికి తీసుకొచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com