గర్భిణులు, బాలింతలు పౌష్టికాహారం తప్పని సరిగా తీసుకోవాలని దొర్నిపాడు ఐసీడీఎస్ సూపర్వైజర్ ప్రభాకరమ్మ అన్నారు. శుక్రవారం పౌష్టికాహార మాసోత్సవం సందర్భంగా దొర్నిపాడు వెలుగు కార్యాలయం లో మహిళలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సూపర్ వైజర్ మాట్లాడుతూ గర్భిణులు పండ్లు, ఆకు కూరలు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలని సూచించారు. ఏపీఎం బాబు, రజితారెడ్డి, ఏఎన ఎం వెంకటసుబ్బమ్మ పాల్గొన్నారు.