ఆల్బెండజోల్ మాత్రలతోనే నులిపురుగుల నివారణ సాధ్యమని, 19 సంవత్సరాలలోపు ఉన్న ప్రతి ఒక్కరూ ఈ మాత్రలను వాడాలని వైద్యాధికారి డాక్టర్ శివశంకరుడు సూచించారు. కర్నూలు జిల్లా, బనగానపల్లె ఎంపీడీవో నాగరాజుకు, మండల విద్యాధికారి కార్యాలయంలో విద్యాధికారి స్వరూప, సీఆర్పీలు ప్రసాద్, సుధాకర్‌కు శుక్రవారం వైద్యుడు మాత్రలను అందించారు. మండలంలో 19,500 మంది 19 సంవత్సరాలలోపు వారు ఉన్నట్లు గుర్తించామని చెప్పారు. సెప్టెంబరు 17వతేదీ జాతీయ నులిపరుగుల దినోత్సవం సందర్భంగా మండలంలోని అన్ని పాఠశా లలకు ఈమాత్రలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. వైద్య సిబ్బంది వెంకటే శ్వర్లు, అయ్యమ్మ, రమేశ, నాగలక్ష్మి, ఉపాధ్యాయులు, ఏఎనఎంలు పాల్గొన్నారు.