గత ఎన్నికల్లో టీడీపీ విజయం కోసం కష్టపడిన నాయకులకు, కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పేర్కొన్నారు. గుత్తి పట్టణంలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన కార్యకర్తలతో సమావేశం నిర్వహించి మాట్లాడారు.కార్యకర్తలకు నిత్యం అండగా ఉంటామన్నారు. పార్టీ విజయానికి కష్టపడిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్త్తామన్నారు. కార్యకర్తలు పార్టీ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. అనంతరం విజయవాడ వరద బాధితుల సహాయార్థం ధాన్యం సేకరణ చేపట్టిన కార్యకర్తలకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ గుత్తి ఇనచార్జి గుమ్మనూరు నారాయణ, టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.టీడీపీ గుత్తి పట్టణ అధ్యక్షుడిగా ఎంకే చౌదరిని ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పార్టీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశం అనంతరం ఎంకే చౌదరిని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఎంకే చౌదరికి, ఎమ్మెల్యేకి, ఆయన సోదరుడు గుమ్మనూరు నారాయణకు స్ధానిక నాయకులు, కార్యకర్తలు శాలువాలు పూలమాలతో ఘనంగా సన్మానించారు. నాయకులు ప్రతాప్, కరిడికొండ సూరి, చిన్నరెడ్డియాదవ్, చికెన శీనా, శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.