తాడిపత్రి మండలంలోని ఆలూరు, బోడాయిపల్లి, వెలమకూరు గ్రామాల్లో శుక్రవారం జరిగిన గ్రామసభల్లో ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామాల్లో ప్రజలు పలు సమస్యల్ని ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. ముఖ్యంగా సీసీరోడ్లు, డ్రైయినేజీలు లేక ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. వెంటనే సమస్యలు తీర్చాలని కోరారు. అలాగే ఉపాధిహామీ పనిదినాలు 200రోజులకు పెంచడంతోపాటు కూలీ గిట్టుబాటు అయ్యేలా చూడాలని విన్నవించారు. ఆలూరు గ్రామసభలో తమ భూములను కొందరు ఆక్రమించుకున్నారని పలువురు గ్రామస్థులు ఎమ్మెల్యేకు తెలిపారు. ఇందుకు ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆక్రమించుకున్న భూముల గురించి సంబంధిత అధికారులతో మాట్లాడి న్యాయం చేస్తానన్నారు. ప్రతి గ్రామంలో సీసీ రోడ్ల ఏర్పాటుకు కృషిచేస్తానన్నారు. ఉపాధిహామీ పనులు చేపట్టేవిధంగా చర్యలు తీసుకోవాలని ఏపీఓ ఆదినారాయణమ్మను ఆదేశించారు. అనంతరం పౌష్టికాహార మాసోత్సవాల పోస్టర్లను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. గ్రామసభల్లో ఎంపీడీఓ రంగారావు, ఈఓఆర్‌డీ జిలానబాషా, ఎంఈఓ నాగరాజు, సీడీపీఓ సాజిదాబేగం, సూపర్‌వైజర్ లక్ష్మిదేవి, టీడీపీ నాయకులు కదిరి శ్రీకాంతరెడ్డి, మల్లికార్జునరెడ్డి, హరినాథ్‌రెడ్డి, నరేంద్రనాయుడు, చింబిలి ప్రసాద్‌నాయుడు తదితరులు పాల్గొన్నారు.