విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడే బాధ్యత తమదని ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం కోరేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఈరోజు(శనివారం) పల్లా శ్రీనివాసరావు విశాఖలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం కృషి చేస్తామని.. అలా చేయకపోతే తాను తన పదవులకు రాజీనామా చేసి స్టీల్ ప్లాంట్ నిరాహార దీక్షలో కూర్చుంటానని పల్లా శ్రీనివాసరావు అన్నారు.