బాల్య వివాహాలు చేయడం చట్టరీత్యా నేరమని ఆళ్లగడ్డ సీడీపీవో తేజశ్వని అన్నారు. శుక్రవారం కర్నూలు జిల్లా, చాగలమర్రి గ్రామంలోని 13వ అంగనవాడీ కేంద్రంలో పోషణ మాసో త్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గర్భిణులు, బాలింతలు ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. బాల్య వివాహాల వల్ల కలిగే నష్టాల గురించి తల్లులకు వివరించారు. పౌష్టికా హారంతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని అన్నారు. సమావేశంలో టీఎన టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుత్తి నరసింహులు, సూపర్‌వైజర్లు రామలింగారెడ్డి, సుశీల, ఏపీవో నిర్మల, ఏఎనఎం లీలావతి, అంగనవాడీ వర్కర్లు, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.