ఎన్టీఆర్ జిల్లా, విస్సన్నపేట మండలంలో ఓ మైనర్ బాలికపై అత్యాచారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు ఫోక్సో కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. విస్సన్నపేట మండలం, చండ్రుపట్ల గ్రామంలో మరీదు శివయ్య (40) అనే వ్యక్తి మైనర్ బాలికపై అఘాహిత్యానికి పాల్పడ్డాడు. ఆలస్యంగా విషయం తెలుసుకున్న బాలిక తండ్రి పానుగళ్ళ వెంకటేశ్వరరావు విసన్నపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మరీదు శివయ్య (40) చుండ్రుపట్ల గ్రామానికి చెందిన వ్యక్తి. అదే గ్రామానికి చెందిన మైనర్ బాలిక (17), ఇంట్లో ఎవరూ లేరు సమయం చూసుకుని శివయ్య బాలికపై అత్యాచారం చేశాడు. దీంతో విసన్నపేట పోలీసులు నిందితుడిపై సెక్షన్4 ఫోక్సో యాక్ట్ 64(1), బీఎన్ఎస్ కేసు నమోదు చేసి ధర్యాప్తు చేపట్టారు.