ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రిజిస్ట్రేషన్‌ల శాఖ కీలక నిర్ణయాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Sep 15, 2024, 05:35 PM

సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఇకపై రాజరికపు పొకడలకు స్వస్తి పలకనుంది. కోర్టుల్లో జడ్జిల తరహాలో సబ్ రిజిస్ట్రార్లు కూర్చొనే విధానానికి చెల్లు చీటి పలికేలా రిజిస్ట్రేషన్‌ల శాఖ నిర్ణయాలు తీసుకోనుంది. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల రూపు రేఖలు మార్చే అంశంపై ప్రభుత్వానికి రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్ సిసోడియా, మంత్రి అనగని సత్య ప్రసాద్ ప్రతిపాదనలు చేశారు. క్షేత్రస్థాయి పర్యటనలు నేపథ్యంలో తాము గమనించిన ఆఫీస్ సెటప్‌లో మార్పులు తీసుకురావాలని నిర్ణయించి.. అమలుకు సర్క్యులర్ జారీ చేశారు.అన్ని ప్రభుత్వ ఆఫీసుల్లో ఉన్నట్టుగానే సబ్ రిజిస్ట్రార్ల సీటింగ్ ఆరేంజ్‌మెంట్ ఉండేలా చర్యలు తీసుకోనున్నారు. సబ్ రిజిస్ట్రార్లు కూడా సామాన్యులేననే భావన కలిగేలా రెవెన్యూ శాఖ కసరత్తు చేస్తోంది. సబ్ రిజిస్ట్రార్‌కు ఉన్న ఎత్తైన పోడియం సీటింగ్ చుట్టూ వున్న రెడ్ క్లాత్ తొలగించాలని ఆర్‌పి సిసోడియా అదేశించారు. సబ్ రిజిస్ట్రార్ చైర్ కూడా ఫ్లోర్ హైట్‌లో ఉండాలని.. ఆయన చుట్టూ ఎలాంటి పార్టిషన్ ఉండకూడదని ఆదేశించారు. భూములు రిజిస్ట్రేషన్‌ల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా చేసే సామాన్య ప్రజలకు ఆఫీస్‌లో అత్యధిక గౌరవం ఉండాలని, రిజిస్ట్రేషన్ పూర్తి అయ్యే వరకు వచ్చినవారు నిలబడి వుండే విధానానికి స్వస్తి పలకాలన్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆలస్యం అయితే వారికి టీ, మంచి నీరు ఆఫర్ చేసి గౌరవించాలని రెవెన్యూ, రిజిస్ర్టేషన్ల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్‌పీ సిసోడియా ఆదేశిస్తూ.. ఈ మేరకు సర్క్యులర్ జారీ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com