శృంగవరపుకోట నియోజకవర్గ జనసేన ఇన్‌చార్జి ఒబ్బిన సత్యనారాయణ వ్యవ హరిస్తున్న తీరుపై డిప్యూటీ సీఎం, జనసేనాని పవన్ కల్యాణ్‌కు ఫిర్యాదు చేస్తానని శృంగవరపుకోట మేజర్ పంచాయతీ సర్పంచ్ గనివాడ సంతోషికుమారి ఒక ప్రకటనలో తెలిపారు. చలానా కట్టకుండ ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడమే కాకుండా రోజులు గడుస్తున్నా తొలగించలేదని, ఇప్పుడు చలానా కట్టి ఫ్లెక్సీలను ఏర్పాటు చేసుకునేందుకు వాటిని తొలగిస్తే మహిళనని చూడకుండా గౌరవం లేకుండా మాట్లాడుతున్నారన్నారు. నీఅంతు చూస్తా, నీసంగతి చెబుతానని బెదిరిస్తున్నారన్నారు. పంచాయతీకి ఆర్థిక వనరులు సమకూర్చుకునేందుకు ఫ్లెక్సీల ఏర్పాటుకు రుసుం వసూలు చేస్తున్నా మన్నారు. పవన్ కల్యాణ్ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తున్న పంచాయతీకి మద్దతు ఇవ్వకుండా రాద్ధంతం ఎందుకు చేస్తున్నారో అర్ధం కావడం లేదన్నారు. కూట మి ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్న సత్యనారాయణ ఈవిధంగా వ్యవహరించడం సరికాదని హితవు పలికారు.