కుమార్తె కనిపించడం లేదని సంతకవిటి మండల పరిధిలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి శనివారం రాత్రి విజయనగరం జిల్లా, సంతకవిటి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కుమార్తెకు పెళ్లి చెయ్యాలి అనే ఆలోచనతో సంబంధాలు వెతుకుతున్న క్రమంలో వివాహం చేసు కునేందుకు ఇష్టం లేని తన కుమార్తె ఇంటి నుంచి వెళ్లిపోయిందని ఆ ఫిర్యాదులో పేర్కొన్నాడు. బంధుమిత్రులు, స్నేహితులు ఇళ్లలో వెతికినా ఫలితం లేదని ఫిర్యా దులో స్పష్టం చేశారు. తండ్రి ఫిర్యాదు మేరకు ఎస్సై ఆర్. గోపాలరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.