పుట్టపర్తి ముస్సిపాల్టీ పరిధిలోని కర్ణాటక నాగేపల్లికి చెందిన సాధారణ మహిళ పెద్దన్నగారి ఈశ్వరమ్మ విజయవాడ వరద బాధితులను ఆదుకోవడానికి ముందుకు వచ్చింది. శనివారం జిల్లా కేంద్రంలోని టీడీపీ కార్యాలయానికి వచ్చిన ఆమె రూ. 50 వేలను మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డికి విరాళంగా అందజేసింది. టీడీపీ నాయకులు, పలువురు స్థానికులు ఆమెను అభినందించారు.