అనంతపురం జిల్లా వ్యాప్తంగా అక్టోబర్ రెండో తేదీన మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని స్వచ్ఛ భారత్ దివస్ ను పెద్ద ఎత్తున నిర్వహించనున్నట్లు కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. అనంతపురం కలెక్టరేట్లో ఆదివారం ఆయన మాట్లాడారు.
ఈ నెల 17 నుంచి అక్టోబర్ రెండో తేదీ వరకు 'స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాన్ని' నిర్వహిస్తామన్నారు. అన్ని శాఖల అధికారులు పాల్గొని జయప్రదం చేయాలన్నారు.