దేశ రాజధాని ఢిల్లీలో గత ఐదేళ్లలో దాదాపు 5000 ఫేక్ వీసాలు తయారు చేసి, రూ.300 కోట్లు సంపాదించిన నకిలీ వీసా రాకెట్‌ను పోలీసులు చేధించారు. నకిలీ వీసాపై ఇటలీకి వెళ్లేందుకు యత్నించిన.
ఓ వ్యక్తి ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో అధికారుల చేతికి చిక్కడంతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఏజెంట్‌కు రూ.10 లక్షలు ఇచ్చి తాను నకిలీ వీసా పొందినట్లు సదరు వ్యక్తి పోలీసులకు తెలిపాడు. ఈ కేసులో ఇప్పటివరకు ఆరుగురు అరెస్టయ్యారు.