తెలంగాణలో చెరువులు, నాళాలను ఆక్రమించి కట్టిన నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తున్న సంగతి తెలిసిందే. ఈ తరహాలోనే ఏపీలోనూ ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేస్తామని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ తెలిపారు. దీనికోసం అవసరమైతే కొత్త చట్టం తీసుకొస్తామని అన్నారు. బుడమేరు కాలువతో పాటు రాష్ట్రంలోని నీటి వనరుల ఆక్రమణలపై సర్వే ప్రారంభం అవుతుందని చెప్పారు. ఈ తరహా ఆక్రమణలకు పాల్పడ్డ వారు ఎవరైనా ఉపేక్షించేది లేదని తెలిపారు.