ఇప్పటి వరకు ఏడు విడతల్లో 2030 ఫోన్లను జిల్లా పోలీసులు రికవరీ చేశారు. ఎనిమిదో విడతలో రూ.66లక్షల విలువ చేసే 305 సెల్ఫోన్లను రికవరీ చేశారు. ఈ వివరాలను ఆదివారం ఎస్పీ మణికంఠ చందోలు మీడియాకు తెలిపారు. చిత్తూరు జిల్లాలో కొంత కాలంగా వందలాది మంది మొబైల్ ఫోన్లను పోగొట్టుకున్నారు. ఈ ఫోన్లను రికవరీ చేయడానికి చాట్‌బాట్ బృందం తగిన చర్యలు చేపట్టింది. నెలల వ్యవధిలో ఏపీతోపాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర నుంచి చోరీకి గురైన 66 లక్షల విలువ చేసే 305 ఫోన్లను రికవరీ చేశారు. ఈ ఫోన్లను ఆదివారం పోలీసు అతిథి గృహంలో బాధితులకు అందించారు. మొబైల్ ఫోన్‌ను పోగొట్టుకున్న వారి ముందుగా 9440900004 నెంబరు వాట్సా్‌పకు హాయ్ లేదా హెల్ప్ అని పంపాలి. ఆ తర్వాత వెల్కమ్ టూ చిత్తూరు పోలీసు పేరున ఒక లింకు వస్తుంది. ఆ లింకులో గూగుల్ ఫార్మేట్ ఓపెన్ అవుతుంది. అందులో జిల్లా, పేరు, వయస్సు, తండ్రి, చిరునామా, కాంటాక్టింగ్ నెంబరు, మిస్ అయిన మొబైల్ మోడల్, ఐఎంఈఐ నెంబరు, మొబైల్ మిస్ అయిన ప్లేస్ వివరాలను నమోదు చేయాలి. ఈ సేవలను ప్రజలు వినియోగించుకోవాలని ఎస్పీ కోరారు.