కోడుమూరు బీసీ బాలికల ప్రీ మెట్రిక్ హాస్టల్ వార్డెన్ కనకలత విధుల నుంచి వెంటనే సస్పెండ్ చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి రంగస్వామి డిమాండ్ చేశారు. హాస్టల్ ముందు ఆదివారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థినులకు మెనూ ప్రకారం భోజనం అందించడం లేదని, వార్డెన విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. నాయకులు వీరాంజనేయులు, సిద్దు, వినయ్, విజయ్ పాల్గొన్నారు.