ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 20, 2024, 11:43 AM

ఏపీలో తిరుమల లడ్డూ ప్రసాదంపై వివాదం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. వైసీపీ హయాంలో తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో జంతువుల కొవ్వును వాడారని సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి.ఈ వివాదంపై వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం పీక్స్ కి చేరింది.ఈ క్రమంలో తిరుమల లడ్డూ వివాదంపై జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ స్పందించారు. ట్విట్టర్‌ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్.తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారన్న విషయం తెలిసి తీవ్రంగా కలత చెందానన్నారు పవన్ కళ్యాణ్. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు ఉపయోగించి, భక్తుల మనోభావాలు దెబ్బతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సనాతన ధర్మరక్షణ కోసం జాతీయ స్థాయిలో బోర్డు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com