ప్రకాశం జిల్లాలోని రాచర్ల మండలంలో శ్రీ నెమలిగుండ్ల రంగనాయక స్వామి ఆలయం ఉంది. ఈ ఆలయానికి వచ్చే భక్తులు శుద్ధిగా లేకపోతే ఆలయ ప్రాంగణ పరిసర ప్రాంతాలలో ఉన్న తేనెటీగలు వారిని కుట్టి ఆలయ ఆవరణలో నుంచి తరిమేస్తాయని ఇక్కడికి వచ్చే భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు.
అంతేకాదు ఈ విషయం ఎన్నో సార్లు నిరూపితమైందని చెబుతారు. అయితే శుచిగా రాని భక్తులను తేనెటీగలు తరిమిన సమయంలో గోవింద నామ స్మరణ చేస్తే తేనెటీగలు కుట్టవని అంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa