తిరుమల లడ్డూ వ్యవహారంలో సీఎం చంద్రబాబు వైసీపీ నాయకత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో... కిలో నెయ్యి చవకగా రూ.320కే వస్తోందని తిరుమల లడ్డూను కల్తీ చేశారని మండిపడ్డారు. శ్రీ వేంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదానికి నాసిరకం నెయ్యి వాడారని, తిరుమల పవిత్రను దెబ్బతీశారని వ్యాఖ్యానించారు. ఎవరైనా కల్తీ నెయ్యితో దేవుడికి నైవేద్యం పెడతారా? అని చంద్రబాబు ప్రశ్నించారు. తాను తప్పు చేయలేదని, టెండర్లు పిలిచానని జగన్ చెబుతున్నారని... రూ.320కే కిలో నెయ్యి వస్తుందంటే ప్రభుత్వం వెనుకా ముందూ ఆలోచించాల్సిన అవసరం లేదా? అని నిలదీశారు. పరమ పవ్రితమైన తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడి ప్రజల మనోభావాలను దెబ్బతీశారని చంద్రబాబు విమర్శించారు. ప్రకాశం జిల్లా మద్దిరాలపాడులో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు.