ఢిల్లీ ముఖ్యమంత్రిగా అతిశీ ప్రమాణ స్వీకారం చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సెనా అతిశీతో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, తదితరులు హాజరయ్యారు. గోపాల్ రాయ్, కైలాశ్ గెహ్లాట్, సౌరభ్ భరద్వాజ్, ఇమ్రాన్ హుస్సేన్, ముఖేశ్ అహ్లావత్ మంత్రులుగా ప్రమాణం చేశారు.ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరవింద్ కేజ్రీవాల్ అరెస్టయ్యారు. కొన్ని నెలలు తీహార్ జైల్లో ఉన్న కేజ్రీవాల్ బెయిల్ మీద విడుదలయ్యారు. జైలు నుంచి విడుదలైన తర్వాత ఆయన తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. దీంతో అతిశీ సీఎంగా ప్రమాణం చేశారు.అతిశీ కల్కాజీ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. కేజ్రీవాల్ కేబినెట్‌లో ఏకైక మహిళా మంత్రిగా పని చేశారు. ఆ తర్వాత సెప్టెంబర్ 17న జరిగిన పార్టీ శాసన సభ్యుల సమావేశంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు అతిశీని సీఎంగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.